ఎఫ్ డీ ఐ పాలసీ సవరణ.. ఇండియాపై చైనా మండిపాటు

| Edited By: Pardhasaradhi Peri

Apr 20, 2020 | 4:19 PM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యపట్ల చైనా మండిపడింది. వాణిజ్య విధానాలకు సంబంధించి ఏ దేశం పట్లా వివక్ష చూపరాదన్న ప్రపంచ వాణిజ్య సంస్థ సూత్రాలను ఉల్లంఘించేదిగా ఈ సవరణ ఉందని చైనా ఆరోపించింది. ఇది సముచితం కాదని, భారత ప్రభుత్వం తన చర్యను సరిదిద్దుకోవాలని చైనా ఎంబసీ ఓ ప్రకటనలో కోరింది. ఇతర దేశాలతో బాటు తమకు కూడా పెట్టుబడులకు అనుమతించాలని, పారదర్శకమైన, న్యాయమైన వాణిజ్య సంబంధాలకు అనువుగా నడచుకుంటుందని […]

ఎఫ్ డీ ఐ పాలసీ సవరణ.. ఇండియాపై చైనా మండిపాటు
Follow us on

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యపట్ల చైనా మండిపడింది. వాణిజ్య విధానాలకు సంబంధించి ఏ దేశం పట్లా వివక్ష చూపరాదన్న ప్రపంచ వాణిజ్య సంస్థ సూత్రాలను ఉల్లంఘించేదిగా ఈ సవరణ ఉందని చైనా ఆరోపించింది. ఇది సముచితం కాదని, భారత ప్రభుత్వం తన చర్యను సరిదిద్దుకోవాలని చైనా ఎంబసీ ఓ ప్రకటనలో కోరింది. ఇతర దేశాలతో బాటు తమకు కూడా పెట్టుబడులకు అనుమతించాలని, పారదర్శకమైన, న్యాయమైన వాణిజ్య సంబంధాలకు అనువుగా నడచుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా చైనా తన ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు  భారత దేశంలోని కంపెనీలపై కన్ను వేసిందని, వాటిని టేకోవర్ చేసుకోవడానికి యత్నిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. మన ఎకానమీని దెబ్బ తీసే చైనా ప్రయత్నానికి చెక్ పెడుతూ,, ఎఫ్ డీ ఐ నిబంధనలను సవరించింది. ఈ సవరణల ప్రకారం, చైనా సహా మరే ఇతర దేశమూ ఇక్కడ ఏ సంస్థలోనైనా పెట్టుబడులు పెట్టేముందు ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ ఎఫ్ డీ పాలసీని సవరించింది. ఇది చైనాకు ఆగ్రహాన్ని కలిగించింది.