Strain Virus: స్ట్రెయిన్ వైరస్ విజృంభణ.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాలంటూ రాష్ట్రాలకు ఆదేశం..

కరోనా రూపాంతర స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలను మరికొంత కాలం పొడిగించింది.

Strain Virus: స్ట్రెయిన్ వైరస్ విజృంభణ.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాలంటూ రాష్ట్రాలకు ఆదేశం..

Updated on: Dec 28, 2020 | 8:06 PM

Strain Virus: కరోనా రూపాంతర స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలను మరికొంత కాలం పొడిగించింది. ఆ మేరకు సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన నిబంధనలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తప్పల అమలు చేయాలని ఆదేశించింది. మన దేశంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేకపోయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రూపాంతర వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు అనివార్యమని పేర్కొంది. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. టెస్టులు, బాధితులను ట్రేస్ చేయడం, కంటోన్మెంట్ ఏరియాలో పకడ్బందీ ఏర్పాట్లు వంటి పక్కాగా అమలు చేయాలంది. ప్రజలు కూడా కరోనా నిబంధలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందరూ విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.

 

Also read:

Kcr Review Meeting: నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ కేసీఆర్ సమీక్ష.. అపెక్స్ కౌన్సిల్‌, ప్రాజెక్టు నిర్మాణంపై కీలక చర్చ..

Pawan Kalyan : “వైజాగ్, విజయవాడ, పులివెందుల.. రైతుల కోసం ఎక్కడికైనా వస్తాం”..జనసేనాని పవర్ పంచ్