Captain Tom Moore : వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్‌కు కరోనా పాజిటివ్.. బెడ్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స

"వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్" కెప్టెన్ టామ్ మూర్ కోవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన తండ్రి..

Captain Tom Moore : వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్‌కు కరోనా పాజిటివ్.. బెడ్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స

Updated on: Feb 03, 2021 | 5:28 PM

Captain Tom Moore : “వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్” కెప్టెన్ టామ్ మూర్ కోవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన తండ్రి.. బెడ్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆయన గత కొన్ని వారాలుగా నిమోనియాతో బాధపడుతున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో గత వారం ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా విజృంభణ మొదలైన తొలినాళ్లలో మహమ్మారిపై పోరాటానికి టామ్ మూర్.. భారీ స్థాయిలో విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.

తుంటి ఎముక విరగడం వల్ల స్టాండ్ సహాయంతో నడుస్తున్నారు. కెప్టెన్ టామ్ మూర్ 100వ పుట్టిన రోజుకు ముందు ఆయన గార్డెన్ విస్తీర్ణం ఎంత ఉందో దాని కన్నా వంద రెట్లు ఎక్కువ దూరం నడిచి ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ద్వారా ఆయన కరోనా బాధితుల కోసం విరాళాలను సేకరించారు.

‘జస్ట్ గివింగ్’ పేజీ ద్వారా ఆయన ఆ చందాలను పోగు చేశారు. తనను ప్రోత్సహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరడంతో ప్రపంచ వ్యాప్తంగ భారీ స్పందన లభించింది. ఆ నిధి మొత్తం దాదాపు రూ.285కోట్లు పోగైంది. కాగా.. విరాళాల రూపంలో వచ్చిన ఆ డబ్బును టామ్ మూర్.. ఎన్‌హెచ్ఎస్ సంస్థకు అందించారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..