‘మాకూ కావాలి ఆ మందు’.. రామాయణాన్ని గుర్తు చేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 6:41 PM

కరోనా.. కరోనా.. ఇప్పుడు అన్ని దేశాలూ ఆశగా ఇండియావైపు  ఎదురుచూస్తున్నాయి. మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా ట్రీట్ మెంట్ లో కూడా ఉపయోగపడుతుందని తెలియగానే మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మెడిసిన్ తమకు కావాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. (ఈ మందు పంపకపోతే ప్రతీకార చర్యకు దిగవచ్చునని కూడా హెచ్చరించారు. అయితే అత్యవసర మందులను ‘అత్యవసర దేశాలకు’ పంపుతామంటూ మోదీ ప్రభుత్వం దీని ఎగుమతిపై గల నిషేధాన్ని పాక్షికంగా తొలగించింది. దీంతో ట్రంప్ గారు […]

మాకూ కావాలి ఆ మందు.. రామాయణాన్ని గుర్తు చేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్
Follow us on

కరోనా.. కరోనా.. ఇప్పుడు అన్ని దేశాలూ ఆశగా ఇండియావైపు  ఎదురుచూస్తున్నాయి. మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా ట్రీట్ మెంట్ లో కూడా ఉపయోగపడుతుందని తెలియగానే మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మెడిసిన్ తమకు కావాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. (ఈ మందు పంపకపోతే ప్రతీకార చర్యకు దిగవచ్చునని కూడా హెచ్చరించారు. అయితే అత్యవసర మందులను ‘అత్యవసర దేశాలకు’ పంపుతామంటూ మోదీ ప్రభుత్వం దీని ఎగుమతిపై గల నిషేధాన్ని పాక్షికంగా తొలగించింది. దీంతో ట్రంప్ గారు మాట మార్చి ఇప్పుడు మోదీని ‘ఇంద్రుడు..చంద్రుడు’ అని పొగుడుతున్నారు). ఇక ఇప్పుడు బ్రెజిల్ వంతు వచ్చింది. తమకు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ కావాలని బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో ఇండియాను కోరుతున్నారు. ఈ సందర్భంగా అయన రామాయణాన్ని కూడా గుర్తు చేయడం విశేషం. గత శనివారం మోదీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. తాజాగా మోదీకి  ఒక లేఖ రాశారు. ఇందులో కాస్త పౌరాణిక సెంటిమెంటును కూడా జోడించారు. రామాయణంలో శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడిని రక్షించేందుకు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవిని ఎలా తెచ్చాడో, ఒక అంధునికి  జీసస్ మళ్ళీ చూపు ఎలా తెప్పించాడో..అలా మన దేశాల ప్రజలను రక్షించేందుకు మనం కూడా చేతులు కలుపుదాం అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. భారత 70 వ గణతంత్ర దినోత్సవాలకు బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. కాగా ఆయన తనతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షునికి మన సహకారం తప్పకుండా ఉంటుందని అన్నారు.

బ్రెజిల్ లో గత 24 గంటల్లో 19 మంది కరోనా రోగులు మరణించారు.  దీంతో మృతుల సంఖ్య667 కి పెరిగింది. నిన్నటికి నిన్న 12,056 కంఫామ్ కేసులుండగా తాజాగా అది 13,717 కి పెరిగినట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి ఇప్పుడు 30  దేశాలు ఈ మందు కోసం.. మన చల్లని చూపు కోసం క్యూలో నిలుచున్నాయి.