Neelima Kaushal: ‘బిగ్‌బాస్2’ విజేత కౌశల్ భార్య నీలిమ ఆవేదన.. యూకేలో పరిస్థితి దారుణంగా ఉందని సెల్ఫీ వీడియో.. !

కౌశల్‌ మండా భార్య నీలిమకు ఇంగ్లాండ్‌లో అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి..

Neelima Kaushal: బిగ్‌బాస్2  విజేత కౌశల్ భార్య నీలిమ ఆవేదన.. యూకేలో పరిస్థితి దారుణంగా ఉందని సెల్ఫీ వీడియో.. !
Koushal Wife Neelima

Updated on: Jun 04, 2021 | 7:48 AM

Kaushal wife Neelima : ‘బిగ్‌బాస్2’ విజేత కౌశల్‌ మండా భార్య నీలిమకు ఇంగ్లాండ్‌లో అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. లండన్ కు ఉద్యోగం నిమిత్తం వెళ్లిన ఆమె.. తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే.. “నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కొవిడ్ బారిన ప‌డిన నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వైద్యుల‌కు చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. అంత‌కు మించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా క‌రోనా ల‌క్ష‌ణాలు అట్లే ఉంటాయ‌ని, ఎదుర్కోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు…

యూకేలో ట్రీట్‌మెంట్‌ గొప్పగా ఉంటుందనుకున్నా. నా స్వీయ అనుభ‌వం అందుకు విరుద్ధంగా ఉంది. నా జీవితంలో ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఇదే మ‌న‌దేశంలో అయితే వెంట‌నే వైద్యం అందిస్తారు. ఇక్కడలా కాదు. నాకు చాలా భయమేసింది. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను” అని నీలిమ తనకు లండన్ లో ఎదురైన అనుభవాల్ని పంచుకున్నారు.

కాగా, రెండు రోజుల క్రితం త‌న భార్య అనారోగ్యం గురించి కౌశ‌ల్ ఓ పోస్టు పెట్టారు. ‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ’ అంటూ సోషల్‌ మీడియాలో కౌశ‌ల్ పోస్టులు పెట్టాడు. ఇది కౌశల్ అభిమానుల్లో పెద్ద చర్చకే దారితీసిన సంగతి తెలిసిందే.

Read also : Jagananna colonies : ఇళ్లు లేని వారు ఎక్కడా ఉండకూడదు.. పండగ వాతావరణంలో నిర్మాణాలకు పునాదులు వేస్తున్నాం : జగన్

Loading...
Unable to load recommendations.
Follow Us