‘కరోనా చెక్’ ని బ్యాంక్ క్యాషియర్ ఎలా ‘డీల్’ చేశాడంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Apr 06, 2020 | 7:28 PM

కరోనా జడలు విప్పి నర్తిస్తున్న వేళ.. ఒక నగదు చెక్ ని బ్యాంకు క్యాషియర్ ఒకరు ఎలా డిస్ ఇన్ ఫెక్టెంట్ చేశాడంటే  అది చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. అంటే దానిపై కరోనా వైరస్ ఛాయల్లేకుండా దాన్ని ‘నాశనం’ చేశాడన్న మాట..  లాక్ డౌన్ కారణంగా బ్యాంకులతో సహా కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్న వేళ.. బరోడా బ్యాంక్ క్యాషియర్ ఒకరు తనకు ఓ కస్టమర్ ఇఛ్చిన చెక్ మీద వైరస్ మటుమాయమయ్యేలా చూసేందుకు […]

కరోనా చెక్ ని బ్యాంక్ క్యాషియర్ ఎలా డీల్ చేశాడంటే ?
Follow us on

కరోనా జడలు విప్పి నర్తిస్తున్న వేళ.. ఒక నగదు చెక్ ని బ్యాంకు క్యాషియర్ ఒకరు ఎలా డిస్ ఇన్ ఫెక్టెంట్ చేశాడంటే  అది చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. అంటే దానిపై కరోనా వైరస్ ఛాయల్లేకుండా దాన్ని ‘నాశనం’ చేశాడన్న మాట..  లాక్ డౌన్ కారణంగా బ్యాంకులతో సహా కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్న వేళ.. బరోడా బ్యాంక్ క్యాషియర్ ఒకరు తనకు ఓ కస్టమర్ ఇఛ్చిన చెక్ మీద వైరస్ మటుమాయమయ్యేలా చూసేందుకు పాటించిన పధ్దతి ‘అబ్బో’ అనిపిస్తోంది. ముఖానికి మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించిన ఇతగాడు ఆ చెక్ ని రెండు చిన్న కర్రముక్కల వంటి దానితో  జాగ్రత్తగా పట్టుకుని.. తన డెస్క్ వద్ద గల ఇస్త్రీ పెట్టెతో రెండు వైపులా వేడి చేసి పక్కన పెట్టాడు. ఇది కరోనా వ్యాప్తిని ఎలా అరికడుతుందో తెలియదు గానీ.. ఈ క్యాషియర్ తెలివికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఐసయిపోయి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇతని క్రియేటివిటీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని కామెంట్ చేశారు. ఈ వీడియోకు రెండున్నర లక్షల వ్యూస్ రాగా  సుమారు 30 వేల లైక్స్ వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం ఈ క్యాషియర్ సృజనాత్మకతను ప్రశంసిస్తూ.. అదే సమయంలో ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.