కోవిడ్-19 వ్యాక్సీన్లు రానున్నాయ్ ! ప్రపంచ ఆరోగ్య సంస్థ

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 4:44 PM

కరోనా మహమ్మారి చికిత్సలో తోడ్పడే రెండు వ్యాక్సీన్లు రానున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బ్రిటన్ కు చెందిన 'యాస్ట్రాజెనికా' ప్రయోగాత్మకంగా కోవిడ్-19 వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేసే దశలో ఉందని, బహుశా ఇదే ప్రపంచంలో 'లీడింగ్  వ్యాక్సీన్' కావచ్ఛునని..

కోవిడ్-19 వ్యాక్సీన్లు రానున్నాయ్ ! ప్రపంచ ఆరోగ్య సంస్థ
Follow us on

కరోనా మహమ్మారి చికిత్సలో తోడ్పడే రెండు వ్యాక్సీన్లు రానున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బ్రిటన్ కు చెందిన ‘యాస్ట్రాజెనికా’ ప్రయోగాత్మకంగా కోవిడ్-19 వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేసే దశలో ఉందని, బహుశా ఇదే ప్రపంచంలో ‘లీడింగ్  వ్యాక్సీన్’ కావచ్ఛునని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. యాస్ట్రాజెనికా అప్పుడే పెద్ద ఎత్తున ఈ వ్యాక్సీన్ ని తయారు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్ లో మధ్య దశలో ఉందని, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్లు డెవలప్ చేసిన ఈ మెడిసిన్.. చాలావరకు కోవిడ్-19 చికిత్సలో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని ఆమె అన్నారు. ఇది బహుశా మరో ఏడాది..లేదా అంతకన్నా ముందే రావచ్చునని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. యాస్ట్రాజెనికా ఇటీవలే తన మ్యాన్యుఫ్యాక్చర్ డీల్ పై సంతకం చేసిందని సౌమ్యా స్వామినాథన్ చెప్పారు. ఇదే సమయంలో అమెరికాకు చెందిన ‘మోడెర్నా’ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ కూడా ముందంజలో ఉందని ఆమె తెలిపారు. జులై రెండో వారం నుంచి ఈ వ్యాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కి వెళ్తుందని, మొత్తం మీద అది కూడా ‘దరిదాపుల్లోనే’  ఉందని పేర్కొన్నారు. యాస్ట్రాజెనికా వ్యాక్సీన్ ని స్వచ్చందంగా తీసుకునేందుకు సుమారు 200 మంది సిధ్ధంగా ఉన్నారు. వీరిలో 15 మందికి క్లినికల్ పరీక్షలు మొదలయ్యాయి అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. ఈ వ్యాక్సీన్ల విషయంలో తమ సంస్థ చైనాకు చెందిన ‘సినోవాక్’ సంస్థతో బాటు భారతీయ పరిశోధకులతోనూ చర్చలు జరుపుతోందని ఆమె వెల్లడించారు.