కరోనా లాక్‌డౌన్‌: ఏపీలో మరిన్ని మినహాయింపులకు కసరత్తులు

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల్లో భాగంగా మరిన్ని మినహాయింపులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కరోనా లాక్‌డౌన్‌: ఏపీలో మరిన్ని మినహాయింపులకు కసరత్తులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 09, 2020 | 8:44 PM

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల్లో భాగంగా మరిన్ని మినహాయింపులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కంటైన్‌మెంట్, బఫర్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు నిర్వహించేలా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ మెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేలా.. అలాగే సరి-బేరి సంఖ్యలో దుకాణాలను విభజించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతేకాదు కేంద్రం సూచనల మేరకు సొంత వాహనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్లు సమాచారం. వీటితో పాటు ఏపీ, తెలంగాణ మధ్య పరిమిత సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే వారిని అనుమతించే అంశంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా ఏపీలో 1930 కరోనా కేసులు నమోదు కాగా..887 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Read This Story Also: ఆ విటమిన్ ఎక్కువగా ఉన్న వారు కరోనాను ఎదుర్కోగలరట..!

Latest Articles