Covid-19 Curfew: ఏపీ కర్ఫ్యూ.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. టికెట్ల రిజర్వేషన్ క్యాన్సిల్.. ఎప్పటివరకంటే..?

| Edited By: Team Veegam

May 05, 2021 | 8:08 PM

APSRTC - Coronavirus Curfew in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచే వచ్చే వాహనాలను

Covid-19 Curfew: ఏపీ కర్ఫ్యూ.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. టికెట్ల రిజర్వేషన్ క్యాన్సిల్.. ఎప్పటివరకంటే..?
Apsrtc
Follow us on

APSRTC – Coronavirus Curfew in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచే వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు, ప్రజా రవాణా పనిచేయనున్నాయి. అనంతరం వాటిపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. రాష్ట్రంలో కర్ఫ్యూ దృష్ట్యా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఆర్టీసీ రద్దుచేసింది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు నుంచి ఈనెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగానే అప్పటికప్పుడు పలు రూట్లల్లో బస్సులు సమకూర్చనున్నారు. మధ్యాహ్నం 12 లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత గమ్యస్థానాలు చేరుకునే దూరప్రాంత బస్సు సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉంటే.. ఏపీలో కర్ప్యూను అధికారులు కఠినంగా అమలుచేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వాహానాలను సరిహద్దుల్లోనే ఆపి.. వెనక్కి పంపుతున్నారు.

Also Read: పొలంలో అడ్డుగా ఉందని రాయిని జరిపిన రైతు.. తెలియకుండానే పెద్ద పొరపాటు చేశాడు.. చివరకు..

Lockdown: లాక్‌డౌన్ పొడిగించిన ఉత్తరప్రదేశ్ సర్కార్.. ఇవి తప్ప అన్నీ బంద్.. బయటకు రావాలంటే ఈ పాస్ తప్పనిసరి!

తెలంగాణలో లాక్ డౌన్ ఉండబోదు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా అదుపులోనే ఉందిః సీఎస్

అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చిందా? మీకు పీపీఎఫ్ ఖాతా ఉందా.. అక్కడ రుణం తీసుకోండి.. వివరాలు ఇవిగో..