ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 30,863 శాంపిల్స్ టెస్ట్ చేయగా 183 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2072014కి చేరింది. కొత్తగా ఒకరు కృష్ణా జిల్లాలో కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14431కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో163 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2055389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2194 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 3,02,86,530 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. గుంటూరు జిల్లాలో 30 మంది, కృష్ణా జిల్లాలో 27 మంది కరోనా బారిన పడ్డారు.
#COVIDUpdates: 25/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,69,119 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,494 మంది డిశ్చార్జ్ కాగా
*14,431 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,194#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rXyRcQmv9E— ArogyaAndhra (@ArogyaAndhra) November 25, 2021
కరోనా సమాచారం మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
●వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
Also Read: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో బ్రీత్లెస్ సాంగ్.. స్టన్ అయిన నటుడు మాధవన్.. ఇన్స్టాలో పోస్ట్
చేపను క్రూరంగా వేటాడిన ఎండ్రకాయ.. కొండెలతో కనుగుడ్డు పీకేసి.. షాకింగ్