AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కల్లోలం.. కొత్తగా 1,439 పాజిటివ్ కేసులు, నిన్న ఒక్కరోజే 14మంది మృతి

|

Sep 09, 2021 | 5:23 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. గడిచిన వారం రోజులతో పోల్చితే కాస్త అధికంగా కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కల్లోలం.. కొత్తగా 1,439 పాజిటివ్ కేసులు, నిన్న ఒక్కరోజే 14మంది మృతి
Ap Covid 19 Cases
Follow us on

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. గడిచిన వారం రోజులతో పోల్చితే కాస్త అధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 1,439 కరోనా కేసులు నమోదు నమోదయ్యాయి. ఇవాళ నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,26,042కి కోవిడ్ కేసులు రికార్డు అయ్యాయి. ఇక, గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మొత్తంగా 13,964 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇదిలావుంటే, ప్రస్తుతం ఏపీలో మొత్తంగా 14,624 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,97,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, జిల్లాల వారీగా ఇవాళ వెలుగుచూసిన మరణాలను పరిశీలిస్తే… కృష్ణా నలుగురు, చిత్తూరు 3, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

ఏపీలో వివిధ జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…

Ap Corona Cases