AP Coronavirus Cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన పడుతున్న బాధితుల సంఖ్య నిత్యం క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకూ) రాష్ట్ర వ్యాప్తంగా 1,398 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 9,05,946 కి చేరగా.. మరణాల సంఖ్య 7,234కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో 787 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,89,295కి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31,260 పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటివరకు 1,51,77,364 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 03/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,03,051 పాజిటివ్ కేసు లకు గాను
*8,86,400 మంది డిశ్చార్జ్ కాగా
*7,234 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,417#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/FHCCXsDTqJ— ArogyaAndhra (@ArogyaAndhra) April 3, 2021
Also Read: