1990 నాటి యాంకర్ సుమ అరుదైన ఫొటో.. అవాక్కవ్వాల్సిందే..

| Edited By:

Jun 13, 2020 | 7:20 PM

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో ఆమె ఓ ఇంటి మనిషిలా మారిపోయింది. పేరుకు తమిళ అమ్మాయే అయినప్పటికీ.. రాజీవ్‌తో పెళ్లి తర్వాత పక్కా తెలుగమ్మాయిలా మారిపోయింది. కొత్త యాంకర్లు ఎంత మంది వచ్చినా..

1990 నాటి యాంకర్ సుమ అరుదైన ఫొటో.. అవాక్కవ్వాల్సిందే..
Follow us on

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో ఆమె ఓ ఇంటి మనిషిలా మారిపోయింది. పేరుకు తమిళ అమ్మాయే అయినప్పటికీ.. రాజీవ్‌తో పెళ్లి తర్వాత పక్కా తెలుగమ్మాయిలా మారిపోయింది. కొత్త యాంకర్లు ఎంత మంది వచ్చినా.. సుమ స్థాయిని ఎవరూ చేరుకోలేకపోయారు. మళ్లీ ఈమె లాంటి యాంకర్ వస్తుందా? రాదా? అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాకర్స్ ఉన్నా.. సుమ కనకాల ఎప్పటికీ ఎవర్ గ్రీనే.

మొదట తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమ.. అప్పట్లో పలు సీరియల్లో నటించింది. అలాగే ప్రముఖ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు దర్మకత్వంలో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది సుమ. అయితే ఈ మధ్య లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన సుమ.. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలో తను అప్పట్లో దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆ మధ్య తన సోషల్ మీడియా పేజిలో అభిమానులతో పంచుకుంది సుమ. ‘పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటో’ అని షేర్ చేసింది.

Read More: 

బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..

అనారోగ్యంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి