‘బ్లాక్ బస్టర్ ఆగష్టు’కు ముస్తాబ‌యిన‌ ‘ఆహా OTT’

తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న 'ఆహా OTT' యాప్‌ ఆగస్టులో 10 సినిమాలను అందిస్తుంది. పాపులర్ యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఫేసుబుక్ లైవ్ ద్వారా పలు విషయాలు...

బ్లాక్ బస్టర్ ఆగష్టుకు ముస్తాబ‌యిన‌ ఆహా OTT

Edited By:

Updated on: Aug 03, 2020 | 10:03 PM

తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ‘ఆహా OTT’ యాప్‌ ఆగస్టులో 10 సినిమాలను అందిస్తుంది. పాపులర్ యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఫేసుబుక్ లైవ్ ద్వారా పలు విషయాలు ప్రకటించారు. మొదట దిల్ రాజు.. ‘బుచ్చినాయుడు కండ్రిగ’ సినిమాని ప్రకటించారు. ఇది ఆగస్ట్ 21వ తేదీన‌ ఆహాలో విడుదల కాబోతుంది. తెలుగు వినోదాన్ని అందిస్తున్న ఆహాలో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు.

ఇక‌ పాపులర్ కమెడియన్ హర్ష సరికొత్త రియాలిటీ షో ప్రకటించారు. ‘తమాషా విత్ హర్ష’ అనే సరికొత్త షో ఈనెల 22నుండి మొదలుకానుంది. చివరగా సుమ OTTలో తొలిసారి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. సమకాలీన అంశాలతో ‘అల్ ఈజ్ వెల్’ అనే వెరైటీ షోని ప్రకటించారు. ఆగస్ట్ 14 నుండి ‘సుమ ఆల్ ఈజ్ వెల్’ ప్రసారం అవుతుంది.

Read More:

రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

క్రేజీ కాంబోః అన్నగా విష్ణు, చెల్లిగా కాజ‌ల్