
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు అత్యల్పంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కూడా.. ఇప్పుడు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఒడిషాలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రా వ్యాప్తంగా
నమోదైన కేసుల సంఖ్య 1660కి చేరింది. వీరిలో 812 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 841 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు కరోనా బారినపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే. దేశ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా కేసులు నమోదవ్వగా.. అరవై ఏడు వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.