యూఎస్: వైట్‌హౌస్ హెచ్చ‌రిక.. దేశంలో 2ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా మ‌ర‌ణాలు..?

Coronavirus Updates: అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 518 మంది పైగా మరణించగా… రాబోయే రెండు వారాల్లో ఈ మరణాల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిగిన సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నా.. ఏప్రిల్ 12 ఈస్టర్ నాటికి మరణాల సంఖ్య లక్ష నుంచి రెండున్నర లక్షల మధ్యకు చేరుకుతుందని వైట్ హౌస్ అంచనా వేస్తోంది. అయితే పబ్లిక్ […]

యూఎస్: వైట్‌హౌస్ హెచ్చ‌రిక.. దేశంలో 2ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా మ‌ర‌ణాలు..?
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:17 PM

Coronavirus Updates: అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 518 మంది పైగా మరణించగా… రాబోయే రెండు వారాల్లో ఈ మరణాల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిగిన సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నా.. ఏప్రిల్ 12 ఈస్టర్ నాటికి మరణాల సంఖ్య లక్ష నుంచి రెండున్నర లక్షల మధ్యకు చేరుకుతుందని వైట్ హౌస్ అంచనా వేస్తోంది.

అయితే పబ్లిక్ హెల్త్ ఆఫీషియల్స్ మాత్రం జనాలు ఒకరి నుంచి మరొకరు దూరాన్ని పాటిస్తూ రావడమే కాకుండా.. దేశంలో ఉన్న ఆసుపత్రులు ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో మరణాలు సంఖ్య తగ్గించవచ్చునని భావిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ నివారించేందుకు రూపొందిస్తున్న ప్రయోగాత్మక కాంబినేషన్ డ్రగ్ కూడా ప్రభావం చూపిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఏది ఏమైనా అమెరికన్లు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తే జూన్ నాటికి కోలుకునే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

‘ఈ మహమ్మారిని అరికట్టడంలో అమెరికన్లు తప్పకుండా విజయం సాధిస్తారని నమ్ముతున్నట్లు వైట్ హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమన్వయకర్త డాక్టర్ డెబోరా బిర్క్స్ అన్నారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా ప్రజలందరూ తమ వంతు పాత్ర పోషించాలని ఆమె తెలిపారు. రెండు వారాల్లో మరణాల సంఖ్య ఇంతమేరకు పెరుగుతాయని కేవలం అంచనా మాత్రమే వేశారని.. కానీ దాన్ని పూర్తిగా అంగీకరించాల్సిన అవసరమైతే లేదని ప్రభుత్వ అత్యున్నత అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ స్పష్టం చేశారు.

‘తన పరిపాలన మార్గదర్శకాలను ప్రజలు తప్పకుండా పాటించాల్సి ఉందని.. ఇప్పుడు మనం ‘జీవన్మరణ సమస్య’ను ఎదుర్కుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ సుమారు లక్షా 50 వేలు మందికి పైగా సోకితే.. మరణాల సంఖ్య 3,500కు చేరింది. అటు ఈ వైరస్ నుంచి త్వరలోనే దేశం కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో