మాస్క్ ధరించకుంటే రూ.200 ఫైన్

ఎన్ని రకాలుగా కట్టడి చేస్తోన్నా.. రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ విధించిన తరువాత కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రజలను కట్టడి చేస్తూ పోలీసులు కఠిన చర్యలే..

మాస్క్ ధరించకుంటే రూ.200 ఫైన్
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 10:50 PM

ఎన్ని రకాలుగా కట్టడి చేస్తోన్నా.. రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ విధించిన తరువాత కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రజలను కట్టడి చేస్తూ పోలీసులు కఠిన చర్యలే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఒడిశాలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.

అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా మాస్క్ ధరించకుంటే రెండు వందల రూపాయల జరిమానా విధించనున్నట్టు తెలిపింది. మాస్క్ ధరించే నిబంధనను ఉల్లంఘించినవారికి మొదటి మూడు సార్లు రూ.200లు, ఆపై నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు అధికారులు. అలాగే ఇప్పుడు ఈ నిబంధనను పలు రాష్ట్రాల్లోనూ విధించారు. కాగా ఒడిశాలో ఇప్పటివరకూ 42 కరోనా కేసులు నమోదుకాగా.. ఒకరు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం