కరోనా వైరస్‌.. టెస్టింగ్‌ సెంటర్‌గా ప్రముఖ క్రికెట్ స్టేడియం

కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో వారికి చికిత్స అందించేందుకు రైళ్లు, హోటళ్లు, కాలేజీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకుంటున్నారు దేశాధినేతలు.

కరోనా వైరస్‌.. టెస్టింగ్‌ సెంటర్‌గా ప్రముఖ క్రికెట్ స్టేడియం
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 9:38 PM

కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో వారికి చికిత్స అందించేందుకు రైళ్లు, హోటళ్లు, కాలేజీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకుంటున్నారు దేశాధినేతలు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని ప్రముఖ క్రికెట్ స్టేడియంను ఇప్పుడు కరోనా టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియాన్ని కోవిడ్‌ టెస్టింగ్ సెంటర్‌గా మార్చనున్నారు.

నేషనల్ హెల్త్ సర్వీసుల్లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ స్టేడియాన్ని కరోనా వైరస్‌ టెస్టింగ్ సెంటర్‌గా మార్చడానికి కసరత్తులు పూర్తి చేసినట్లు వార్విక్‌షైర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీల్ స్నో బాల్‌ తెలిపారు. ”కరోనా నేపథ్యంలో దేశంలోని క్రికెట్ సంబంధిత కార్యక్రమాలు, సమావేశాలు, ఈవెంట్స్‌, వ్యాపార కార్యకలాపాలన్నీ మే 29వరకు బంద్‌ చేశాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా సిబ్బంది అంతా ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే దృష్టి సారించింది. దీనికి మాజీ ఆటగాళ్ల సాయం తీసుకుంటున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ను కరోనా వైరస్ సెంటర్‌గా మార్చడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు అనుమతి లభించిన వెంటనే ఇక్కడ కరోనా టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది” అని నీల్ పేర్కొన్నారు.

Read This Story Also: ఆర్ఆర్ఆర్ః ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!