అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!

మహారాష్ట్రలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఏకంగా 3323 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 201కు చేరింది. అంతేకాకుండా అక్కడున్న ఆసుపత్రులన్నీ కూడా కరోనా రోగులతో నిండిపోయాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మహా సర్కార్ నియమించిన స్పెషల్ కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ తాజాగా కరోనా పాజిటివ్ పేషంట్ల విషయంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సుమారు ముంబైలోని 40 శాతం కరోనా బాధితులను హాస్పిటల్స్ నుంచి కోవిడ్ కేర్ సెంటర్లు, […]

అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!
Follow us

|

Updated on: Apr 18, 2020 | 6:45 PM

మహారాష్ట్రలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఏకంగా 3323 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 201కు చేరింది. అంతేకాకుండా అక్కడున్న ఆసుపత్రులన్నీ కూడా కరోనా రోగులతో నిండిపోయాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మహా సర్కార్ నియమించిన స్పెషల్ కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ తాజాగా కరోనా పాజిటివ్ పేషంట్ల విషయంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సుమారు ముంబైలోని 40 శాతం కరోనా బాధితులను హాస్పిటల్స్ నుంచి కోవిడ్ కేర్ సెంటర్లు, లేదా హోం క్వారంటైన్లకు తరలించాలని సూచించింది.

ఎటువంటి అనారోగ్యం, లక్షణాలు లేని కరోనా రోగులను ఐదు రోజుల తర్వాత కోవిడ్ కేర్ సెంటర్స్, వారి నివాసాలకు పంపవచ్చు. అది కూడా ఐదు రోజుల తర్వాత వారి కరోనా పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ఇది చేయవచ్చు. దీని వల్ల వైద్యులపై భారం తగ్గి.. వారు క్రిటికల్ కండిషన్‌లో ఉన్న రోగులను చూసుకునే అవకాశం ఉంటుంది. దానితో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని COVID-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ సంజయ్ ఓక్ అన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు ఆరు శాతానికి చేరుకోవడంతో పాటు గత వారం రోగుల సంఖ్య వేగంగా పెరిగిన తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం కెఈఎం ఆసుపత్రి మాజీ డీన్ డాక్టర్ సంజయ్ ఓక్‌ను టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే గురువారం జరిగిన సమావేశానికి హాజరైన రాష్ట్ర, బీఎంసీ ఆరోగ్య అధికారులు ఈ కొత్త మార్గదర్శకాలను ఆమోదించారు. “ఐదు రోజులు చికిత్స అనంతరం వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక ఇది ఇతర వ్యక్తులకు వ్యాపించదు. అందుకే కొంతమంది పేషంట్లను కోవిడ్ కేర్ సెంటర్లకు, లేదా వాళ్ల ఇంటికి పంపించవచ్చు. ఇక ఈ రెండు కేంద్రాల్లోకి తరలించిన బాధితులను హెల్త్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని డాక్టర్ సంజయ్ ఓక్ అన్నారు, ఇక ఈ తరలింపు ప్రక్రియ విషయమై కేవలం పూర్తి చెకప్ అయిన తర్వాత డాక్టర్లు మాత్రమే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

671 పేషంట్లు డిశ్చార్జ్…

ఇప్పటివరకు ముంబైలో 1936 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 181 మంది డిశ్చార్జ్ కాగా.. 113 మంది మరణించారు. ఇక మిగిలినవారిలో సుమారు 671పేషంట్లను కోవిడ్ కేర్ సెంటర్లు, లేదా హోం క్వారంటైన్లకు తరలించవచ్చునని ఆరోగ్య అధికారి ఒకరు తెలియజేశారు.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

Latest Articles