సిక్కు జుట్టు పట్టుకుని కొట్టిన ఖాకీ, మధ్యప్రదేశ్ లో అమానుషం

మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లాలో ఓ సిక్కును ఓ పోలీసు జుట్టు పట్టుకుని కొట్టిన ఘటన వీడియోలో వైరల్ అవుతోంది. ప్రేమ్ సింగ్ అనే సిక్కు యువకుడు కాళ్ళావేళ్ళా పడుతున్నా కనికరించని ఖాకీ అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

సిక్కు జుట్టు పట్టుకుని కొట్టిన ఖాకీ, మధ్యప్రదేశ్ లో అమానుషం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 08, 2020 | 12:37 PM

మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లాలో ఓ సిక్కును ఓ పోలీసు జుట్టు పట్టుకుని కొట్టిన ఘటన వీడియోలో వైరల్ అవుతోంది. ప్రేమ్ సింగ్ అనే సిక్కు యువకుడు కాళ్ళావేళ్ళా పడుతున్నా కనికరించని ఖాకీ అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. జనమంతా చూస్తుండగానే.. అతడి జుట్టు పట్టుకుని కొడుతూ రోడ్డుపై తరిమాడు. తనను హింసిస్తున్నాడని, తన స్టాల్ పెట్టుకోవడానికి అనుమతించడంలేదని, లంచం ఇవ్వనందుకే ఇలా దాడి చేశాడని బాధితుడు గగ్గోలు పెట్టాడు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా స్పందిస్తూ.. తన తాళం చెవుల షాపును పెట్టుకునేందుకు ప్రేమ్ సింగ్ ని పోలీసులు అనుమతించడం లేదని, లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఖాకీలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.  తలపాగా తొలగించి జుట్టు పట్టుకుని కొట్టడంసిక్కు మతస్థుల సెంటిమెంట్లను గాయపర్చడమే అన్నారు.

అయితే జిల్లా ఎస్పీ మాత్రం తమ పోలీసుల చర్యను సమర్థించారు. జబల్ పూర్ జిల్లాలో జరిగిన మూడు చోరీ కేసుల్లో ప్రేమ్ సింగ్  నిందితుడని, పైగా తన స్నేహితునితో బైక్ పై ఇతడు వస్తుండగా ఆ వాహనానికి లైసెన్స్ లేకపోవడమే గాక, ఇతగాడు మద్యం మత్తులో ఉన్నాడని ఆయన చెప్పారు. పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చినందుకు నానా రభసా సృష్టించాడన్నారు. అయితే  ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర హోం మంత్రి ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.