నక్సలైట్‌గా చిరంజీవి..కత్తిలాంటి కథ సిద్దం..?

మెగాస్టార్ చిరంజీవి..ఈ నేమ్‌కు ఇండియన్ సిల్వర్ స్రీన్ హిస్టరీలోనే ఓ సపరేట్ మార్క్ ఉంది. మాస్ పల్స్ పట్టుకోవడంలో మెగాస్టార్‌కు సాటి మరొకరు ఉండరు. చిరు స్టెప్‌ వేసినా..ఫైట్ చేసినా..ఎమోషన్ పండించినా..అందులో యూనిక్‌ స్టైల్ ఉంటుంది. అందుకే ఆయన 64 ఏళ్ల వయస్సులోనూ సిల్వర్ స్రీన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇటీవలే ‘సైరా’ వచ్చిన చిరంజీవి సాలిడ్ హిట్ అందుకున్నారు. అదే ఉత్సహంలో మెగాస్టార్ తన 152 వ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రం కొరటాల […]

నక్సలైట్‌గా చిరంజీవి..కత్తిలాంటి కథ సిద్దం..?
Follow us

|

Updated on: Nov 03, 2019 | 7:00 PM

మెగాస్టార్ చిరంజీవి..ఈ నేమ్‌కు ఇండియన్ సిల్వర్ స్రీన్ హిస్టరీలోనే ఓ సపరేట్ మార్క్ ఉంది. మాస్ పల్స్ పట్టుకోవడంలో మెగాస్టార్‌కు సాటి మరొకరు ఉండరు. చిరు స్టెప్‌ వేసినా..ఫైట్ చేసినా..ఎమోషన్ పండించినా..అందులో యూనిక్‌ స్టైల్ ఉంటుంది. అందుకే ఆయన 64 ఏళ్ల వయస్సులోనూ సిల్వర్ స్రీన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇటీవలే ‘సైరా’ వచ్చిన చిరంజీవి సాలిడ్ హిట్ అందుకున్నారు. అదే ఉత్సహంలో మెగాస్టార్ తన 152 వ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రం కొరటాల దర్శకత్వంలో ఉండబోతుందన్న విషయం అందరికి తెలిసిందే. కొరటాల తెరకెక్కించిన మిర్చి, భరత్ అనే నేను, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇలా అన్ని సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్టు సెట్ చేసారు కొరటాల. ప్రస్తుతం సినీ అభిమానులంతా చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి కథను సిద్ధం చేసారని చర్చించుకుంటున్నారు.  ‘సైరా’ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్‌కు పుల్ మీల్స్ లభించలేదు. కాగా తాజాగా కొరటాల సినిమాతో ఆ లోటు తీరేలా కనిపిస్తోంది. ఫిలిం సర్కిల్ నుంచి ఇన్పర్మేషన్ ప్రకారం… నక్సలిజం నేపథ్యంలో స్టోరీ బ్యాక్‌డ్రాప్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. నక్సలిజం ఎక్కువగా ఉన్నప్పటి పరిస్థితులను కవర్ చేస్తూ..ఇటు ఫ్యాన్స్ కూడా సంతృప్తి చెందేలా కథ సిద్దమైనట్టు సమాచారం. మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో మెస్మరైజ్ చేస్తారట. అద్భుతమైన కథకి తోడు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్  సినిమాకు మరింత ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మెగాస్టార్ చెయ్యని ఓ స్పెషల్ పాత్రలో చూపించాలని కొరటాల తెగ ఉవ్వీళ్లూరుతున్నాడట. ప్రస్తుతం పాత్రకు తగ్గట్లుగా బాడీని మలుచుకునేందుకు చిరు వర్కవుట్స్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే నెల నుంచి షూటింగ్ జరుపుకోనుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో… వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చిరు యాప్ట్ కాకుంటే..చెర్రీ రెడీనా..?

కాగా కథ ప్రకారం చిరంజీవి యుక్తవయస్సులో నక్సలైట్‌గా కనిపించాల్సి ఉందట..కానీ చిరు వయస్సు రిత్యా.. ఆ పాత్రలో రామ్ చరణ్ అయితే సరిగ్గా యాప్ట్ అవుతారన్న ఓపినియన్స్ వచ్చాయట. అందుకోసం చిరంజీవి, రామ్ చరణ్‌తో ఇప్పటికే ఈ విషయాన్ని కొరటాల శివ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌ కి ఐ ఫీస్ట్ మాములుగా ఉండదు. కానీ దీనిపై అటు మెగా ఫ్యామిలీ కానీ లేదా దర్శకుడు కొరటాల శివ గాని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..