Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

‘సైరా నరసింహా రెడ్డి’ రివ్యూ: రొమ్ము విరిచి.. మీసం తిప్పుతూ.. కోటకు వేలాడాడు!!

Chiranjeevi Sye Raa Narasimha Reddy Telugu Movie Review, ‘సైరా నరసింహా రెడ్డి’ రివ్యూ: రొమ్ము విరిచి.. మీసం తిప్పుతూ.. కోటకు వేలాడాడు!!

టైటిల్: సైరా నరసింహా రెడ్డి
యాక్టర్స్: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, అనుష్క, సుదీప్, విజయ్ సేతుపతి రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు
డైరెక్టర్: సురేందర్ రెడ్డి
బేనర్: కొణిదెల ప్రొడక్షన్
మ్యూజిక్: అమిత్ త్రివేది, జూలియస్ ఫాఖియం
ప్రొడ్యూసర్: రాంచరణ్
సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
డైలాగ్స్: బుర్ర సాయిమాధవ్
కథ : పరుచూరి బ్రదర్స్
విడుదల తేదీ: 02.10.2019

మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా..!

కథ:
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ దొరలు తెలుగు ప్రజలపై పడి.. వారి సొంత భూములలో చాకిరి చేయిస్తూ.. వారికి రావాల్సిన సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకుని.. అష్టకష్టాలు పెడుతున్న రోజులవి. అడ్డం తిరిగిన ప్రజల్ని జాలి, దయ లేకుండా ప్రాణాలు తీస్తున్న రోజులవి..! అలాంటి పరిస్థితుల్లో జమిందారీ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ వారికి ఎలా ఎదురు తిరిగి నిలిచాడు.? వారిని ఎదుర్కొనడానికి ‘సైరా’ వేసిన ఎత్తుగడలు ఏమిటి? మధ్యలో ‘సైరాకి’ సాయం చేసిన వీరులు ఎవరు..? చివరికి ‘సైరా నరసింహా రెడ్డి’ ని ఉరి తీసారా? లేదా..? ఇదే అసలు కథాంశం.

నటీనటులు:

మెగాస్టార్ చిరంజీవి: నటన ఈ చిత్రంలో బాగుంది అనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా జమిందారుగా.. సెకండ్ హాఫ్ అంతా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసే వీరుడిగా ఆయన మార్కులు కొట్టేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చేసే కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం ఖాయం.

చిరంజీవికి భార్యగా నయన కూడా బాగా నటించింది. ఈమె క్రేజ్, నటన సినిమాకి అదనపు ఆకర్షణ. అలాగే.. తమన్నా కూడా.. కొత్త పాత్రలో అందరికీ పరిచయం అవుతుంది. సైరాలో ఆమె లుక్‌ మొత్తం సపరేట్ అనే చెప్పలి. ఇక అమితాబ్ గురువు పాత్రలో కేక పుట్టించారు. ఇక జగపతి బాబు, విజయ్ సేతు పతి, సుదీప్ మిగతా తారాగణం సూపర్‌గా నటించి జీవించారనే చెప్పాలి.

డైరెక్టర్: దర్శకుడు సురేందర్ రెడ్డి.. సైరా సినిమాను బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. ఇంతమంది లెజండరీ యాక్టర్స్‌తో పనిచేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ.. మెగాస్టార్ చిరంజీవి జీవిత కల సినిమా. అదీ.. స్వాతంత్ర్య సమరయోధుడి స్టోరీ. ప్రతీ సన్నివేశాన్ని అత్యద్భుతంగా మలిచాడు. సెంటిమెంట్ విషయంలో కానీ.. విరోచిత సన్నివేశాలు బాగా తెరకెక్కించాడు.

రత్నవేలు :
సినిమాని ‘పాన్ ఇండియా’ కళ వచ్చేలా చేసాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ‘స్వాతంత్య్రం రాక ముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉండేది ₹’ అనే దగ్గర నుండి… యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, పాటలను చిత్రీకరించిన విధానానికి ఇతను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.

సంగీతం: ఈ చిత్రంలో 4 పాటలే ఉన్నప్పటికీ వాటికి.. అద్భుతమైన మ్యూజిక్ అందించాడు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. అయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం జూలియస్‌ పాకియం అందించాడు. ‘ఏక్ ద టైగర్’ ‘ధూమ్ 3’ ‘కిక్’ వంటి బాలీవుడ్ చిత్రాలకి సంగీతం అందించిన జూలియస్‌ పాకియం.. ‘సైరా’ చిత్రానికి కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. ‘వాటర్ సీక్వెన్స్’ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ కు ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ‘గూజ్ బంప్స్’ రావడం ఖాయం.

ప్లస్ పాయింట్స్:

కథ
కథనం
మ్యూజిక్
యాక్టింగ్
సహ పాత్రలు
ఇంటర్‌వెల్ సీన్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

తెలిసిన కథ

సమీక్ష: మొత్తానికి సినిమా సూపర్ హిట్.. మెగాస్టార్ కష్టానికి ఫలితం దక్కింది.