Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: 9 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న వైసీపీ ఎంపీల బృందం.. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీ వెళ్లనున్న ఎంపీలు.. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ ని కలిసి రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయనున్న ఎంపీలు..
  • భారత్ బయోటెక్‌కు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ. భారత కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని సూచన. ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్ చేస్తే ఆగస్ట్ 15 నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్. పంద్రాగస్టు సందర్భంగా వ్యాక్సిన్ లాంఛ్ చేసే అవకాశం.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • చిన్నారి అధ్య హత్య కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు నిన్న ఇస్మాయిల్ గూడా విహారి హోమ్స్ లో చిన్నారి అధ్య పై జరిగిన ఘటన. వృత్తి రీత్యా బయటికి వెళ్లిన అనూష భర్త కళ్యాణ్... కళ్యాణ్ లేని సమయంలో అనూష వద్దకు వచ్చిన రాజశేఖర్... రాజశేఖర్ ఉన్న విషయం తెలుకొని అనూష ఇంటి వద్దకు వచ్చిన కరుణాకర్.. రాజశేఖర్,కరుణాకర్ స్నేహితులు తనని దూరం పెడుతుంది అని రాజశేఖర్ ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి వచ్చిన కరుణాకర్... గతంలోనే అనూష కి కరుణాకర్ కి పరిచయం.. అనూష స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి విచారించానున్న పోలీసులు... భర్త కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కరుణాకర్.. ఆదిత్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అనూష
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.

హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా?

Chiranjeevi Brings Back Manisharma For Koratala Film, హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా?

మెగాస్టార్-మణిశర్మల జోడీ మళ్లీ తెరపైన మ్యాజిక్ చేయబోతోందా? అవుననే అంటున్నాయి సినీవర్గాలు. కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి చేసే 152వ సినిమాకు మణిశర్మను మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. బావగారూ బాగున్నారా..అన్నయ్య..చూడాలని వుంది..ఇంద్ర ఇలా ఎన్నో హిట్ లు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫిస్ వల్ల బ్లాక్ బస్టర్లుగా, మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మొన్నటిదాకా పెద్దగా సినిమాలు లేకున్నా.. ఈ మధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చారు మెలడీ బ్రహ్మ మణిశర్మ. పైగా టాలీవుడ్ ను సంగీత దర్శకుల కొరత పట్టి పీడిస్తోండటంతో మణిశర్మకు ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఈ సినిమాకు ముందుగా బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్లు అజయ్-అతుల్ లను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆఖరికి మణిశర్మనే ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌ లో ఎలాంటి మ్యూజిక్ రాబోతుందో అన్న విషయం తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Related Tags