స్పైన్ ఎండోస్కోపీ సమ్మిట్ ప్రారంభించిన చినజీయర్ స్వామీజీ

వైద్యరంగంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన శస్త్రచికిత్స అందుతుందన్నారు ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామీజీ. వెన్నెముక నొప్పితో బాధపడేవారికి అత్యాధునిక చికిత్స అందడం ఒక వరమన్నారు స్వామీజీ. స్పైన్ ఎండోస్కోపీ టెక్నాలజీపై ఇంటర్నేషన్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. యశోధా హాస్పిటల్‌లో న్యూరో సైన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. వైద్యులు చేస్తున్న పరిశోధనల్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలన్నారు. ఈ సమిట్ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వెన్నెముక ఆపరేషన్ చేయాలంటే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేదని, […]

స్పైన్ ఎండోస్కోపీ సమ్మిట్ ప్రారంభించిన చినజీయర్ స్వామీజీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:35 PM

వైద్యరంగంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన శస్త్రచికిత్స అందుతుందన్నారు ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామీజీ. వెన్నెముక నొప్పితో బాధపడేవారికి అత్యాధునిక చికిత్స అందడం ఒక వరమన్నారు స్వామీజీ. స్పైన్ ఎండోస్కోపీ టెక్నాలజీపై ఇంటర్నేషన్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. యశోధా హాస్పిటల్‌లో న్యూరో సైన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. వైద్యులు చేస్తున్న పరిశోధనల్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలన్నారు. ఈ సమిట్ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వెన్నెముక ఆపరేషన్ చేయాలంటే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేదని, కానీ స్పైన్ ఎండోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న గాటుతో శస్త్ర చికిత్స చేయగలుగుతున్నామన్నారు. దీనివల్ల వెన్నెముక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

Latest Articles