చైనాలో కొత్తగా 39 మందికి కరోనా వైరస్

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలోనూ ఇంకా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా 39 మందికి కరోనా వైరస్

చైనాలో కొత్తగా 39 మందికి కరోనా వైరస్
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 2:13 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలోనూ ఇంకా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. లక్షణరహిత కేసుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ కు కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో క్రమంగా ఒకవైపు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం ఒక ప్రకటనలో 78 కొత్త అసింప్టోమాటిక్ కేసులు గుర్తించబడ్డాయని తెలిపింది. చైనాలో 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు. ఒకవైపు కరోనా వైరస్ తగ్గిందని భావిస్తుంటే మరోవైపు కొత్తగా కేసులు బయటపడటం చైనా వాసులను ఆందోళన కలిగిస్తోంది.