Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

కరోనా సోకిన వాళ్ల దగ్గరకు వెళ్లారో లేదో.. ఇలా తెలుసుకోవచ్చట..! ట్రై చేయండి ఇలా..

China launches coronavirus 'close contact detector' app, కరోనా సోకిన వాళ్ల దగ్గరకు వెళ్లారో లేదో.. ఇలా తెలుసుకోవచ్చట..! ట్రై చేయండి ఇలా..

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న భయంకరమైన మహమ్మారి కోవిడ్-19 (కరోనా వైరస్). దీని బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇప్పటికే 20 దేశాలకు పైగా ఇది వ్యాపించింది. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో నలభై మూడు వేలమందికి పైగా.. దీని బారిన పడి ఆస్పత్రిపాలయ్యారు. రోజురోజుకు ఈ కొత్త వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా సహా ప్రపంచ దేశాలన్నీ నివారణ చర్యలు చేపట్టాయి.

ఇప్పుడు ఈ వైరస్ చైనాకు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రపంచ దేశాలన్నింటిని తాకుతోంది. ఇది ఎవరికి సోకిందో కూడ తెలియడం చాలా కష్టమైంది. మీ పక్కనే ఉన్నవారికి కూడా ఈ వైరస్ బారిన పడిఉండొచ్చు. దీని లక్షణాలు కనిపించినా కచ్చితంగా అది కరోనా వైరస్ అని గుర్తించలేని పరిస్థితి.

గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇది వేగంగా వ్యాపిస్తోంది. అంతేకాదు.. ఇది ఓ అంటువ్యాధిలా మారింది. దీని బారిన పడిన వారిని తాకినా.. వారు ముట్టుకున్న వస్తువులను టచ్ చేసినా.. వైరస్ వెంటనే వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా 42వేల మందికిపైగా వైరస్ సోకినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే చలా కష్టమైన పనే. అందుకే కరోనా వైరస్‌కి పురుడు పోసిన చైనానే.. దీనికి ఓ యాప్ కనిపెట్టింది. అది కూడా వైరస్ ఉన్న వ్యక్తులను మనం దగ్గరికెళ్తా ఈ యాప్ ఇట్టే గుర్తుపట్టేస్తుందట. ఇందుకోసం “Close contact detector” అనే యాప్‌ను డెవలప్ చేసింది.

ఈ యాప్‌ను స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా ఈజీగానే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఎవరికైనా ఈ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనిపించినా లేదా అప్పుడే సోకి ఉన్నా వెంటనే వారిని గుర్తించవచ్చు. మీరు ఉండే దగ్గరలో ఎవరికైనా ఈ వైరస్ ఉందని తెలిస్తే.. ముందు జాగ్రత్తగా వారి నుంచి దూరంగా ఉండొచ్చున్న ఉద్దేశ్యంతో.. చైనా ఈ స్పెషల్ యాప్‌ను డెవలప్ చేశారు. స్మార్ట్ ఫోన్లలో యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్లంతా.. QR కోడ్ ద్వారా scan చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. Alipay, WeChat లేదా QQ యాప్స్ ద్వారా ఈజీగా వైరస్ బాధితులను గుర్తించవచ్చని ఈ యాప్ డెవలపర్స్ పేర్కొన్నారు. తొలుత ఈ Appsలో రిజిస్టర్ అయ్యాక.. ఓ ఐడీ నంబర్ వస్తుంది. ప్రతి యూజర్.. మరో ముగ్గురు ID నెంబర్లతో వైరస్ స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం ఉందట. సో ఒకసారి ట్రై చేసి చూడండి.

Related Tags