దారుణంగా పడిపోయిన చికెన్ ధరలు..కేజీ రూ.60లకే

ఇండియాలో కరోనా భయంతో నాన్‌ వెజ్.. అందులోనూ చికెన్‌ని తినడం మానేశారు మాంసాహారులు. దీంతో.. చికెన్ విలువ మార్కెట్లో దారుణంగా..

దారుణంగా పడిపోయిన చికెన్ ధరలు..కేజీ రూ.60లకే
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 6:56 AM

Coronavirus Effect: ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ‘కరోనా వైరస్’ గడగడలాడిస్తోంది. ప్రతీ దేశంలో దీని ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతోంది. ముఖ్యంగా ఇండియాలో కరోనా భయంతో నాన్‌ వెజ్.. అందులోనూ చికెన్‌ని తినడం మానేశారు మాంసాహారులు. దీంతో.. చికెన్ విలువ మార్కెట్లో దారుణంగా పడిపోయింది. కేవలం ఇప్పుడు కోడి కేజీ రూ.60లకి పడిపోయింది. అదీగాక చికెన్ తింటే కరోనా వ్యాధి వస్తుందని.. సోషల్ మీడియా వ్యాప్తంగా పలు పుకార్లు ఫుల్లుగా ట్రోల్ అవుతున్నాయి. దీని కారణంగా పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ కేజీ రూ.180 నుంచి 200 రూపాయలు పలికేది. కానీ ఇప్పుడు రిటైల్‌గా 60 రూపాయలకి పడిపోయింది. ఈ ట్రోల్స్‌కి ముందు రోజుకు 700 నుంచి 800 కిలోల చికెన్ వ్యాపారం జరిగేది. ఆదివారాలైతే 1500 కిలోలకు పైగా అమ్మకాలు ఉండేవి. కానీ ఇప్పుడు 20 శాతం పడిపోయిందంటున్నారు వ్యాపారులు. ఈ వైరస్ కారణంగానే తమ వ్యాపారాలు పడిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిజం తెలిసిన వ్యక్తులు ఎలాంటి సంకోచం లేకుండా చికెన్‌ని తింటున్నారని.. అపోహ పడేవారు అసలు చికెన్‌ని కొనడమే మానేశారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో చికెన్ అమ్మకాలు ఢమాల్ అయినా.. మటన్ షాపులు మాత్రం కళకళలాడుతున్నాయి. కరోనా భయంతో చాలా మంది మాంసాహారులు మేకలు, గొర్రెల మాంసం వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే ‘చికెన్‌కి కరోనా వైరస్‌కి మధ్య ఎటువంటి సంబధం లేదని, కోడి, గుడ్లు ఆహారం చాలా తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ అని అంటున్నారు డాక్టర్లు. అలాగే వైరస్ అధిక ఉష్ణోగ్రతలలో నిలబడలేదు. ఏమైనప్పటికీ.. మాంసం ఏదైనా దాన్ని బాగా ఉడికించి తినడం మంచిది. ఆ వేడి బ్యాక్డీరియాను చంపుతుందని తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ అన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు