సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా.. మెట్రో ట్రైన్ బంపర్ ఆఫర్..!

సంక్రాంతికి మెట్రో ట్రైన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగల సీజన్‌లో రహదారులన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతాయన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది సొంత వాహనాల వైపే మొగ్గుచూపుతుంటారన్న ఉద్దేశంతో.. ప్రయాణికులను ఆకర్షించేందుకు టికెట్స్‌ ధరలను అనూహ్యంగా తగ్గించింది. అది కూడా సగానికి సగం. అంటే అక్షరాల టిక్కెట్‌పై యాభై శాతం తగ్గించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల ఓ ప్రకటన విడుదల చేసింది. […]

సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా.. మెట్రో ట్రైన్ బంపర్ ఆఫర్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2020 | 10:36 AM

సంక్రాంతికి మెట్రో ట్రైన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగల సీజన్‌లో రహదారులన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతాయన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది సొంత వాహనాల వైపే మొగ్గుచూపుతుంటారన్న ఉద్దేశంతో.. ప్రయాణికులను ఆకర్షించేందుకు టికెట్స్‌ ధరలను అనూహ్యంగా తగ్గించింది. అది కూడా సగానికి సగం. అంటే అక్షరాల టిక్కెట్‌పై యాభై శాతం తగ్గించింది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన మెట్రోరైళ్లలో.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకే ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా, ఆదివారం, గవర్నమెంట్ హాలీడేస్ ఉన్న రోజుల్లో టికెట్ చార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. ప్రస్తుతం సంక్రాంతి (పొంగల్‌) పండుగను పురస్కరించుకుని.. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో.. ఈ మూడు రోజులు 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని తెలిపింది.

కాగా, 17వ తేదీ చెన్నై మెరీనా బీచ్‌ నుంచి మెట్రో రైల్వేస్టేషన్లకు ప్రత్యేక క్యాబ్‌ వసతిని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఎస్టేట్‌, డీఎంఎస్‌ మెట్రో రైల్లేస్టేషన్ల నుంచి మెరీనా బీచ్‌కు క్యాబ్‌ వసతి కల్పించనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ పేర్కొంది.