సీఎంపై దిశ చట్టాన్ని ప్రయోగించాలి.. : చంద్రబాబు

సీఎం జగన్‌పై దిశ చట్టాన్ని ప్రయోగించాలంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పురపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.. వైసీపీ ఆగడాలు శృతిమించాయన్నారు. టీడీపీ నేతల ఇళ్లల్లో వైసీపీ నేతలే మద్యం బాటిళ్లు పెట్టి.. ఆ తర్వాత వాళ్లే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు ఆర్డినెన్స్‌ను తెచ్చారని మండిపడ్డారు. ప్రత్యర్థుల ఇళ్లలో.. మద్యం బాటిళ్లు పెడతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయని.. పోలీసులు వచ్చి […]

సీఎంపై దిశ చట్టాన్ని ప్రయోగించాలి.. : చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 7:53 PM

సీఎం జగన్‌పై దిశ చట్టాన్ని ప్రయోగించాలంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పురపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.. వైసీపీ ఆగడాలు శృతిమించాయన్నారు. టీడీపీ నేతల ఇళ్లల్లో వైసీపీ నేతలే మద్యం బాటిళ్లు పెట్టి.. ఆ తర్వాత వాళ్లే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు ఆర్డినెన్స్‌ను తెచ్చారని మండిపడ్డారు.

ప్రత్యర్థుల ఇళ్లలో.. మద్యం బాటిళ్లు పెడతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయని.. పోలీసులు వచ్చి నేరుగా వాటర్ ట్యాంక్ ఎక్కడుందని.. అడిగి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఎంతమంది ఇలా కార్యకర్తలు ఇళ్లలో సీసీ ఫుటేజీలు పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరొచ్చి ఇళ్లలో మద్యం బాటిళ్లు ఇళ్లలో పెడుతారో తెలియక.. సీసీ కెమెరాలను పెట్టుకునే పరిస్థితి వచ్చిందని.. వీటిని ప్రశ్నిస్తే.. ఆలపాటి రాజాను పోలీస్ స్టేషన్‌లో ఉంచారని చంద్రబాబు అన్నారు. నామినేషన్లు వేసేందుకు మహిళలు పత్రాలను జాగ్రత్తగా దాచుకుని వెళ్తే.. వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటన విషయంలో సీఎం జగన్‌పైనే దిశ చట్టాన్ని ప్రయోగించాలని చంద్రబాబు అన్నారు. ఇన్ని ఆగడాలు జరుగుతున్నా.. ఈసీకి ఇవన్నీ పట్టవా అంటూ ప్రశ్నించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో