Yantra India Jobs 2023: యంత్ర ఇండియాలో 5,395 ఉద్యోగాలు.. నో ఎగ్జాం.. నో ఇంటర్వ్యూ.. టెన్స్ పాసైతే చాలు

|

Feb 22, 2023 | 9:12 PM

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి.. 5,395 ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Yantra India Jobs 2023: యంత్ర ఇండియాలో 5,395 ఉద్యోగాలు.. నో ఎగ్జాం.. నో ఇంటర్వ్యూ.. టెన్స్ పాసైతే చాలు
Yantra India
Follow us on

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి.. 5,395 ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలోని ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్‌ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 3,508, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి.

పదో తరగతితోపాటు, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నాన్-ఐటీఐ కేటగిరీకికి పోస్టులకు పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు మార్చి 28, 2023వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.200, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. ఎంపికైన వారికి నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.