WII Recruitment 2022: డిగ్రీ అర్హతతో రాత పరీక్షలేకుండానే కేంద్ర ప్రభుత్వ కొలువులు.. నెలకు రూ.42,000ల జీతం..

|

Jun 12, 2022 | 6:24 PM

భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (Wildlife Institute of India)లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ తదితర పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ..

WII Recruitment 2022: డిగ్రీ అర్హతతో రాత పరీక్షలేకుండానే కేంద్ర ప్రభుత్వ కొలువులు.. నెలకు రూ.42,000ల జీతం..
Wwi
Follow us on

WII Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (Wildlife Institute of India)లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ తదితర పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 43

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులు: 30
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులు: 8
  • డేటాబేస్‌ ఆపరేటర్‌ పోస్టులు: 1
  • గ్రాఫిక్‌ డిజైనర్‌ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులు: 3

విభాగాలు: అక్వాటిక్‌ ఎకాలజీ, హెర్పటాలజీ, స్పేషియల్‌ అనలిస్ట్‌, ఫిష్‌ తదితరాలు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: రిజిస్ట్రార్‌, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, చంద్రబాణి, దెహ్రాదూన్‌ 248002.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.