KVS Jobs in AP&TS: తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి వివిధ తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది..

KVS Jobs in AP&TS: తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
KVS Teaching and Non Teaching jobs

Updated on: Mar 21, 2023 | 9:02 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి వివిధ తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, స్పోర్ట్స్‌/ డ్యాన్స్ కోచ్, యోగా ఇన్‌స్ట్రక్టర్‌, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషన్ కౌన్సెలర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆయా పోస్టులను బట్టి రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును అనుసరించి నెలకు రూ.21,250ల నుంచి రూ.26,250ల వరకు జీతంగా చెల్లిస్తారు.

తిరుపతి, నెల్లూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, విజయనగరం, ఘరాసంగం, మహబూబ్‌నగర్‌, బొల్లారం, హకీంపేట్, సీఆర్‌పీఎఫ్‌ బార్కాస్‌, తెనాలి జిల్లాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో నిర్దేశించిన తేదీల్లో (మార్చి 23 నుంచి 27 వరకు) నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఆయా జిల్లాల కేవీఎస్‌ అధికారిక వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us