VIMS Recruitment: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 90వేల‌కు పైగా జీతం..

|

Jan 27, 2022 | 8:57 AM

VIMS Recruitment: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (VIMS) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖపట్నంలో ఉన్నఈ సంస్థ‌లో ప‌లు బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

VIMS Recruitment: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 90వేల‌కు పైగా జీతం..
Follow us on

VIMS Recruitment: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (VIMS) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖపట్నంలో ఉన్నఈ సంస్థ‌లో ప‌లు బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివ‌రాలు మీ కోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 31 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (29), హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్లు (మెడికల్‌): 02 ఖాళీలు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల‌కు గాను న్యూరో సర్జరీ, న్యూరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ డీఎన్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్లు (మెడికల్‌) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌, ఎండీ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)/ ఎంహెచ్‌ఏ/ తత్సమాన ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 42 ఏళ్లు మించ‌కూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను ది డైరెక్ట‌ర్‌, విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, విశాఖ‌ప‌ట్నం – 5300040, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 92,000 జీతంగా చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణకు 30-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: నేడు టాటా చెంతకు చేరనున్న ఎయిర్ ఇండియా.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ఆకాశంలోకి..

world most dangerous tree: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన చెట్టు.. దీని పండు బాంబులా పేలుతోంది.వైరల్ అవుతున్న వీడియో

Mouni Roy: పెళ్లికూతురైన నాగినీ బ్యూటీ.. ట్రెండింగ్ లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు..