UPSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..

|

Nov 09, 2022 | 2:52 PM

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో15 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ, కెమిస్ట్రీ), ఇన్విస్టిగేటర్‌ గ్రేడ్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు..

UPSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..
UPSC Recruitment 2022
Follow us on

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో15 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ, కెమిస్ట్రీ), ఇన్విస్టిగేటర్‌ గ్రేడ్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు నవంబర్‌ 10వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అగ్రికల్చర్‌/అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌/బోటనీ/జువాలజీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/ఫిజికల్‌ ఆంత్రోపాలజీ/జెనెటిక్స్‌/ఫోరెన్సిక్‌ సైన్స్/కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, బీఈ/బీటెక్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.25 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తు అనంతరం హార్డుకాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్‌ 11లోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.