UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 160 ఉద్యోగాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ ప్రభుత్వ విభాగాల్లో.. 160 సీనియర్‌ అగ్రికల్చర్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ కెమిస్ట్, అసిస్టెంట్‌ హైడ్రోలజిస్ట్, జేటీఎస్‌, అసిస్టెంట్‌ జియాలజిస్ట్, అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్ తదితర..

UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 160 ఉద్యోగాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
UPSC Recruitment 2022

Updated on: Nov 13, 2022 | 7:39 AM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ ప్రభుత్వ విభాగాల్లో.. 160 సీనియర్‌ అగ్రికల్చర్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ కెమిస్ట్, అసిస్టెంట్‌ హైడ్రోలజిస్ట్, జేటీఎస్‌, అసిస్టెంట్‌ జియాలజిస్ట్, అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్, లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 1, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 అప్లి్కేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్‌ అగ్రికల్చర్‌ ఇంజనీర్‌ పోస్టులు: 8
  • అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టులు: 13
  • అసిస్టెంట్‌ కెమిస్ట్ పోస్టులు: 21
  • అసిస్టెంట్‌ హైడ్రోలజిస్ట్ పోస్టులు: 70
  • జేటీఎస్‌ పోస్టులు: 29
  • అసిస్టెంట్‌ జియాలజిస్ట్ పోస్టులు: 9
  • అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్ పోస్టులు: 1
  • లెక్చరర్‌ పోస్టులు: 9

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us