Attention Please: యూపీఎస్సీ సివిల్స్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు.. సాయంత్రం 6 గంటల లోపు..

|

Feb 22, 2022 | 2:57 PM

యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (Preliminary) పరీక్ష 2022కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 22) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారెవరైనా ఉంటే ఈ రోజు (మంగళవారం) సాయంత్రం..

Attention Please: యూపీఎస్సీ సివిల్స్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు.. సాయంత్రం 6 గంటల లోపు..
Upsc Civils
Follow us on

UPSC Civil Services exam 2022 Last date: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (Preliminary) పరీక్ష 2022కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 22) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారెవరైనా ఉంటే ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సివిల సర్వీస్‌ ఆశావహులకు యూపీఎస్సీ సూచించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్‌ సర్వీస్‌ నోటిఫికేషన్‌ 2022 ఈ నెల (ఫిబ్రవరి)2న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా UPSC CSE Prelims 2022కు హాజరయ్యే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్లికేషన్‌ విండో ఫిబ్రవరి 4న ప్రారంభమైంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు upsc.gov.in లేదా upsconline.nic.in. వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, సిలబస్, దరఖాస్తుకు చివరితేదీ, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు. కాగా యూపీఎస్సీ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ ద్వారా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లతోసహా విధ సివిల్‌ సర్వీసులకు సంబంధించి మొత్తం 861 ఖాళీలున్నట్టు తెలియజేసింది. ఐతే తాజాగా ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS)కు సంబంధించి గ్రూప్ ‘A’ లోని 150 పోస్టులను యూపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది కూడా. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1011కు పెరిగింది.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2022 ద్వారా ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS), గ్రూప్ ‘A’లో 150 మంది సిబ్బందిని రిక్రూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సివిల్ సర్వీస్‌లలో ఐఆర్‌ఎంఎస్‌ను చేర్చడాన్ని కేంద్రం 2019లో నిరాకరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష (engineering services exam) నిర్వహించి, ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా రైల్వే మంత్రిత్వ శాఖలోని అన్ని స్థాయిల్లో అంటే జూనియర్ స్కేల్ నుంచి HAG+ వరకున్న 8 సర్వీసులను ఏకీకృతం చేస్తున్నట్లు 2019 డిసెంబర్‌లో ప్రకటించింది కూడా. ఈ విధమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతవరకు ఐఆర్‌ఎమ్‌ఎస్‌ నియామకాలు చేపట్టలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది యూపీఎస్సీ ద్వారా 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇతర తాజా అప్‌డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్య వివరాలు:

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2022

మొత్తం ఖాళీలు: 1011

అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022 నాటికి 21 ఏళు ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 2, 1990 నుంచి ఆగస్టు 1, 2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అటెంప్టుల సంఖ్య: ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు అపరిమితం. ఓబీసీ, ఇతర (GL/EWS) అభ్యర్ధులు 9 ప్రయత్నాలలో సర్వీస్ చేపట్టవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిలలో జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష విధానం:

  • ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
  • మొదటి పేపర్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, భారత రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం – జీవావరణ శాస్త్రం, కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఉంటాయి
  • ఐతే వీటిలో రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.
  • మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది.
  • చివరిగా ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది.
  • మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.

ఇంకా పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ 100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 (సాయంత్రం 6 గంటల వరకు).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

viral video: ధైర్యం అంటే ఇదే కదా! బాతు భీకర పోరు..