UGC Recruitment 2021: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (DEB) కోసం ఈ జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 8 ఖాళీలున్నాయి. యూజీసీ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 జూలై 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అధికారిక వెబ్సైట్ https://www.ugc.ac.in/ లో తెలుసుకోవచ్చు.
జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు- 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 12
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాల్సి ఉంటుంది. డిస్టెన్స్, ఆన్లైన్ మోడ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అవగాహన ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇంటర్నెట్ వినియోగం తెలిసి ఉండాలి.
వయస్సు: 2021 జూలై 12 నాటికి 35 ఏళ్ల లోపు
కాంట్రాక్ట్ గడువు: మొదట ఆరు నెలల కోసం నియమిస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.
వేతనం: రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది.