UCO Bank Security Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన యూసీఓ బ్యాంక్ (UCO Bank).. 10 సెక్యురిటీ ఆఫీసర్ పోస్టుల (Security Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇండియన్ నేవీ/ఎయిర్ ఫోర్స్ లేదా పారామిలిటరీ ఫోర్సుల్లో (BSF/CRPF/ITBP/CISF/SSB etc.) అసిస్టెంట్ కమాండెంట్స్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్‌గా కనీసం 5 యేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. లేదా పారామిలిటరీ ఫోర్సుల్లో (BSF/CRPF/ITBP/CISF/SSB etc.) ఇన్స్‌పెక్టర్, సబ్-ఇన్స్‌పెక్టర్‌గా కనీసం 8 యేళ్లు పనిచేసి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2022వ తేదీలోపు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.100, జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.