TSPSC Groups Notification 2022: గ్రూపు 2, 3 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ.. మొత్తం 1955 ఉద్యోగాల భర్తీకి ..

|

Apr 16, 2022 | 4:03 PM

తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు-2 పోస్టులతో పాటు గ్రూపు-3 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా జారీకి టీఎస్పీఎస్సీ (TSPSC) సన్నాహాలు చేస్తోంది..

TSPSC Groups Notification 2022: గ్రూపు 2, 3 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ.. మొత్తం 1955 ఉద్యోగాల భర్తీకి ..
Tspsc
Follow us on

TSPSC Group 2 notification 2022 expected date: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి. ఐతే అందుకు సంబంధించి ఏయే పోస్టులకు ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనే విషయంలో కసరత్తులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు-2 పోస్టులతో పాటు గ్రూపు-3 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా జారీకి టీఎస్పీఎస్సీ (TSPSC) సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు విభాగాల్లో కలిపి 1955 పోస్టులు మాత్రమే ఉన్నందున వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు తాజాగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా 582 గ్రూపు-2 పోస్టులు, 1373 గ్రూపు-3 పోస్టులను (TSPSC Group 3 vacancies) భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

గ్రూపు-2 పరిధిలో పురపాలక కమిషనర్లు- గ్రేడ్‌ 3, ఏసీటీవో, సబ్‌రిజిస్ట్రార్‌- గ్రేడ్‌ 2, పంచాయతీ విస్తరణాధికారి, ఆబ్కారీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, నాయబ్‌ తహసీల్దార్‌, సహాయ రిజిస్ట్రార్‌, సచివాలయ సహాయ విభాగాధికారి, సహాయ కార్మిక అధికారి, సహాయ అభివృద్ధి అధికారి తదితర ఉద్యోగాలున్నాయి. గ్రూపు-3లో సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆడిటర్‌, సహాయ ఆడిటర్‌, టైపిస్టు వంటి పోస్టులున్నాయి. వీటన్నింటికీ కలిపి నోటిఫికేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతిపాదనలు రూపొందించి, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తుది అనుమతులు ఇచ్చాక నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల జాబితాలో 9,168 గ్రూపు-4 పోస్టులున్నాయి. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా? లేక నియామక సంస్థలకు విడివిడిగా ఇవ్వాలా అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై ఆయా శాఖల అభిప్రాయాలను ప్రభుత్వం కోరింది. వాటి నివేదికల ఆధారంగా త్వరలో తుది నిర్ణయం తీసుకునే వీలుంది.

Also Read:

JEE Advanced 2022 Exam Date: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 పరీక్ష తేదీ విడుదల.. ఆగస్టు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ..