TS SI Mains Exam Date: తెలంగాణ ఎస్సై తుది రాత పరీక్ష తేదీలు వెల్లడి.. నేటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ శనివారం (ఏప్రిల్‌ 1) అధికారిక..

TS SI Mains Exam Date: తెలంగాణ ఎస్సై తుది రాత పరీక్ష తేదీలు వెల్లడి.. నేటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌..
TSLPRB SI Mains

Updated on: Apr 03, 2023 | 12:45 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ శనివారం (ఏప్రిల్‌ 1) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సై తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో నేటి (ఏప్రిల్‌ 3) నుంచి 6వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో తప్పనిసరిగా అతికించాలని, లేనిపక్షంగాలో పరిగణనలోకి తీసుకోబోమని బోర్డు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us