AI: ఈ ఏఐ స్కిల్ నేర్చుకుంటే రూ. 20 లక్షల జీతం.. రానున్న రోజుల్లో ఇదే హవా

|

Jun 10, 2024 | 7:10 AM

ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండనుందన్న విషయంపై ఐబీఎం ఎగ్జిక్యూటివ్‌ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం సుమారు 96 శాతం మంది కంపెనీల అధినేతలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మూడింట రెండు వంతుల మంది...

AI: ఈ ఏఐ స్కిల్ నేర్చుకుంటే రూ. 20 లక్షల జీతం.. రానున్న రోజుల్లో ఇదే హవా
Prompt Engineering
Follow us on

ఆర్టిఫిషియల ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది. బడా కంపెనీలు మొదలు చిన్న, చిన్న స్టార్టప్‌ల వరకు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితుల వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కొత్త టెక్నాలజీ ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తోంది. ఏఐ రాకతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు వెంటాడుతాయి.

ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండనుందన్న విషయంపై ఐబీఎం ఎగ్జిక్యూటివ్‌ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం సుమారు 96 శాతం మంది కంపెనీల అధినేతలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు తాము ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయలేదని అంగీకరిస్తున్నారు.

ఏఐ నైపుణ్యాలను నేర్చుకోకపోతే కెరీర్‌లో పురోగతి సాధించలేరని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్‌మెంట్ వైస్‌ ప్రెసిడింట్‌ లిడియా లోగాన్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌కు భారీగా డిమాండ్‌ ఉండనుందని ఆమె తెలిపారు. ఈ నైపుణ్యం నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేదని చెబుతున్నారు. చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించే సమయంలో.. మీ ప్రాంప్ట్ లు ఎంత కచ్చితమైనవి అయితే, ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని తెలిసిందే.

అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ పెరిగింది. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన ఎంప్లాయర్‌ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్‌జీపీటీ, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ చాట్‌బాట్‌లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు. ఇక జీతాల విషయానికొస్తే ప్రాంప్ట్‌ ఇంజనీర్‌కు భారత్‌లో భారీగా జీతాలు అందించనున్నారు. భారత్‌లో ఈ స్కిల్‌ ఉన్న వారు 2-5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉంటే ఏడాదికి రూ. 6 నుంచి రూ. 12 లక్షల వరకు సంపాదించొచ్చు. అదే 5 ఏళ్ల కంటే ఎక్కవ అనుభవం ఉన్న వారికి ఏడాదికి ఏకంగా రూ. 12 నుంచి రూ. 20 లక్షల వరకు ఆదాయం ఉండనుంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..