నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి జూలై 7 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌
TGPSC Seed Certification Officer Recruitment

Edited By:

Updated on: Jul 02, 2026 | 7:27 PM

హైదరాబాద్, జులై 2: తెంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవసాయ రంగ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ ధృవీకరణ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులకు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నత చదువులు చదివిన వారికి ఇదొక సువర్ణావకాశంగా చెప్పవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మొత్తం 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు ఆకర్షణీయమైన శ్రేణిలో జీతభత్యాలు చెల్లిస్తారు. అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే.. జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక విద్యార్హతల విషయానికొస్తే, అభ్యర్థులు ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన ఏదేని విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ (B.Sc. Ag) తో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి.

TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 7, 2026 నుండి ప్రారంభమై, ఆగస్టు 12, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన ను సందర్శించి ప్రొఫార్మా అప్లికేషన్‌ను పూరించవచ్చు. సిలబస్, పరీక్షా విధానం, రిజర్వేషన్లు మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లోని పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను పరిశీలించాలని కమిషన్ సెక్రటరీ తమ ప్రకటనలో స్పష్టం చేశారు.

TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us