TGPSC OTR 2026 Update: నేటితో ముగుస్తున్న ఓటీఆర్‌ అప్‌డేట్‌ గడువు! మళ్లీ పొడిగింపు ఉండదు.. ఆఖరి ఛాన్స్

వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) అప్‌డేట్‌కు సంబంధించిన గడువు ఈ రోజుతో (మార్చి 25)లో ముగియనుంది. ఇంత వరకు అప్‌డేట్‌ చేసుకోని అభ్యర్దులు ఈ రోజు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని..

TGPSC OTR 2026 Update: నేటితో ముగుస్తున్న ఓటీఆర్‌ అప్‌డేట్‌ గడువు! మళ్లీ పొడిగింపు ఉండదు.. ఆఖరి ఛాన్స్
TGPSC OTR Update Deadline

Updated on: Mar 25, 2026 | 11:11 AM

హైదరాబాద్‌, మార్చి 25: టీజీపీఎస్సీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) అప్‌డేట్‌కు సంబంధించిన గడువు ఈ రోజుతో (మార్చి 25)లో ముగియనుంది. ఇంత వరకు అప్‌డేట్‌ చేసుకోని అభ్యర్దులు ఈ రోజు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని కమిషన్‌ సెక్రటరీ ఎం హరిత వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి, వివరాలతోపాటు డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.

టీజీపీఎస్సీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) అప్‌డేట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందరు అభ్యర్థులు గడువు (25/03/2026) లోగా ఓటీఆర్ వివరాలను సరిచూసుకొని సరైన వివరాలను మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ధ్రువ పత్రాలను అప్‌లోడ్ చేసుకోవాలి. తదుపరి ఎలాంటి అవకాశం ఉండదు. రానున్న రిక్రూట్‌మెంట్‌లలో ఈ డేటాను మాత్రమే టీజీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని Telangana Public Service Commission స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) అప్‌డేట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సర్వర్‌తో తిప్పలు

మరోవైపు చివరి గడువు ముగుస్తుండటంతో వెబ్‌సైట్‌ సర్వర్‌ పదేపదే డౌన్‌ అవుతుంది. దీంతో ఓటీఆర్‌ ఎడిట్‌ చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా సాంకేతిక సమస్యలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఓ అభ్యర్థి ప్రయత్నిస్తే అరగంటపాటు లోడింగ్‌ ప్లీజ్‌ వెయిట్‌ అని వచ్చింది. అయితే ఓటీపీ మాత్రం ఎంతకూ రాలేదు. మరో అభ్యర్థి శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రయత్నించినా ఓటీఆర్‌ ఓపెన్‌కాలేదు. ఇలా సర్వర్ బిజీ వస్తుండటంతో అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులుపడ్డారు. మార్చి 25తో ఓటీఆర్‌ అప్‌డేషన్‌ గడువు ముగియనుండటంతో అభ్యర్థులకు టెన్షన్‌ పట్టుకుంది. అభ్యర్థులు వాడే ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటే ఇలాంటి సమస్య తలెత్తుతుందని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. సర్వర్‌ డౌన్‌ సమస్యను చాలా మటుకు పరిష్కరించామని ఆయన అన్నారు.

టీజీపీఎస్సీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) అప్‌డేట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us