TG EAPCET 2026 Results: ఈసారి ఆలస్యం కానున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. ఎదురు చూపులు తప్పవా?
టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం జేఎన్‌టీయూ హైదరాబాద్ మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు కొనసాగాయి..

హైదరాబాద్, మే 15: రాష్ట్ర ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్ 2026) ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం జేఎన్‌టీయూ హైదరాబాద్ మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్షలు రాశారు. తాజాగా ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ మే 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్ కీ రూపొందిస్తారు. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఇందుకు కనీసం 10 రోజుల సమయం పడుతుంది.
షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ పరీక్షల ఫలితాలు మే 25వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా ఈఏపీసెట్ ఫలితాలు మే నెలలో విడుదలైనప్పటికీ కౌన్సెలింగ్ మాత్రం ఆలస్యం కానుంది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో రీఎగ్జాం నిర్వహించి ఫలితాలు వెలువడటానికి, నీట్ కౌన్సెలింగ్ జరగడానికి ఈసారి మరికాస్త ఆలస్యం కానుంది. దీని ప్రభావంతో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయండి.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీజీ డీఈఈసెట్ 2026 హాల్‌టికెట్లు విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్) 2026 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం మే 21న డీఈఈసెట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
టీజీ డీఈఈసెట్ 2026 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




