AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG EAPCET 2026 Counselling: ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే రిజిస్ట్రేషన్లు షురూ

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (TG EAPCET 2026) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సారి మొత్తం 3 విడతల్లో ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు జూన్‌ 19 నుంచి మొదలవనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..

TG EAPCET 2026 Counselling: ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే రిజిస్ట్రేషన్లు షురూ
TG EAPCET Counselling Registration
Srilakshmi C
|

Updated on: Jun 09, 2026 | 4:59 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 9: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (TG EAPCET 2026) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సారి మొత్తం 3 విడతల్లో ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు జూన్‌ 19 నుంచి మొదలవనున్నాయి. జూన్‌ 19 నుంచి 28 వరకు స్లాట్‌ బుకింగ్‌కు చేసుకోవచ్చు. ఇక జూన్‌ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. జూన్‌ 25 నుంచి జులై 1 వరకు వెబ్‌ ఆప్షన్స్‌కు అవకాశం ఉంటుంది. జులై 4న మాక్‌ సీట్‌ అలకేషన్‌ ఉంటుంది. చివరకు జులై 10న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిస్తారు. ఇందులో సీట్లు పొందిన విద్యార్ధులు జులై 10 నుంచి 14 వరకు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవల్సి ఉంటుంది.

ఇక రెండో విడద కౌన్సెలింగ్‌ జూన్‌ 17 నుంచి మొదలవతుంది. సీట్లు పొందిన వారు జులై 25 నుంచి 28 లోపు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. జులై 28లోపు సీటు రద్దు చేసుకోవచ్చు. మూడో విడత కౌన్సెలింగ్‌ జులై 31 నుంచి మొదలవుతుంది.ఆగస్టు 5న సీట్ల కేటాయింపు, ఆగస్టు 5 నుంచి 7లోపు వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఉంటుంది. మొదటి విడతలో సీటు రాని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి జూలై 31న మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ మూడు విడతల ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.

తెలంగాణ ఈసెట్ 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణలోని పాలిటెక్నిక్, బీఎస్‌సీ మ్యాథమెటిక్స్‌ విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీలో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు జూన్ 15 నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఈసెట్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌కు జూన్‌ 15 నుంచి 18 వరకు స్లాట్‌ బుకింగ్, జూన్‌ 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, జూన్‌ 17 నుంచి 21 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్‌ 24వ తేదీలోపు సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇక తుది విడత కౌన్సెలింగ్‌ జులై 4 నుంచి 13వ తేదీ జరుగుతుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. ఈలోపు విద్యార్ధులు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది.

Follow Us
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం