తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. సింగరేణి బొగ్గు గనుల సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 272 ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 1 నుంచి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆయా పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీలో ఇంజినీరింగ్, సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ / డిగ్రీ / పీజీ డిప్లొమా / ఎంబీఏ / ఎంఎస్సీ / ఎంబీబీఎస్ / డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వైద్యాధికారి పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితిపి 30 ఏళ్లుగా నిర్ణయించారు. వైద్యాధికారి పోస్టుల (జీడీఎంవో పోస్టులు)కు 45 ఏళ్లుగా గరిష్ట వయోపరిమితిని ఇచ్చారు. మిగిలిన అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపు ఇచ్చారు. రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.