TGSRTC Jobs 2025: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. డిసెంబర్‌ 30 నుంచే దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 198 టీఎస్‌టీ, ఎంఎస్‌టీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో..

TGSRTC Jobs 2025: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. డిసెంబర్‌ 30 నుంచే దరఖాస్తుల స్వీకరణ
TGSRTC TST MST Notification

Updated on: Dec 26, 2025 | 3:09 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 198 టీఎస్‌టీ, ఎంఎస్‌టీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ (టీఎస్‌టీ) 84 పోస్టులు, మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రెయినీ (ఎంఎస్‌టీ) 114 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 30, 2025వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 2025 జులై 1వ తేదీ నాటకి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా జనవరి 20, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.800, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు 2025 దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.