TGPSC 2026 Notification: ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నవారికి మరో ఛాన్స్.. టీజీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనుంది..

TGPSC 2026 Notification: ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నవారికి మరో ఛాన్స్.. టీజీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్‌ విడుదల
TGPSC AEE Recruitment Notification

Updated on: Jun 04, 2026 | 3:58 PM

తెలంగాణ రోడ్లు, భవనాల (R&B) శాఖ రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

Also Read: IAS ట్రిక్కీ ప్రశ్న: ఓ వ్యక్తి 1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. అయినా 70 ఏళ్లు బతికాడు! ఇదెలా సాధ్యం?

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – ఆర్‌&బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సంబంధిత విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్‌)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (A.M.I.E.) అసోసియేట్ మెంబర్‌గా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 15, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీ అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దీనితోపాటు అదనంగా పరీక్ష రుసుము రూ.120 ప్రతి ఒక్కరూ చెల్లించాలి. అయితే నిరుద్యోగులకు పరీక్ష రుసుము రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే వీరు చెల్లిచవల్సిన అవసరం లేదు. ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష (CBRT or OMR విధానం) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం

రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌కి150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్ 2లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 150 ప్రశ్నలకు 300 మార్కులు చొప్పున కేటాయిస్తారు. రెండు పేపర్లకు కలిపి మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

Also Readపులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 8, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 15, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు.
  • రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 2026లో
  • హాల్‌టికెట్ డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుంచి పరీక్ష ముందు రోజు సాయంత్రం 5:00 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

టీజీపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

Follow Us