TS Inter Supplementary Halltickets 2025: ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,12,724 మంది విద్యార్ధులు ఫీజు చెల్లించారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు తాజాగా వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కాలేజీలు లాగిన్ వివరాలు నమోదు చేసి కళాశాలల నుంచి హాల్ టికెట్లను..
హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్రంలో మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు తాజాగా వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కాలేజీలు లాగిన్ వివరాలు నమోదు చేసి కళాశాలల నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు 4,12,724 మంది విద్యార్ధులు ఫీజు చెల్లించారు. వారిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మందిచ ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఇక ఇంటర్ సెకండియర్‌లో జనరల్ పరీక్షలకు 1,34,341 మంది, ఒకేషనల్ విద్యార్థులు 12,357 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరందరి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఇంటర్ బోర్డు పొందుపరిచింది. మే నెల 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇంటర్‌బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 892 సెంటర్లు ఏర్పాటు చేసింది.