DSC 2008 Aspirants: డీఎస్సీ 2008 బాధితులకు SGT టీచర్‌ కొలువులు.. మాట నిలబెట్టుకున్న్న రేవంత్‌ సర్కార్‌!

|

Sep 25, 2024 | 4:00 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2008 పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీలు)గా నియమించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 24) ప్రకటించింది..

DSC 2008 Aspirants: డీఎస్సీ 2008 బాధితులకు SGT టీచర్‌ కొలువులు.. మాట నిలబెట్టుకున్న్న రేవంత్‌ సర్కార్‌!
DSC 2008 Aspirants
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2008 పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీలు)గా నియమించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 24) ప్రకటించింది. సర్కార్‌ తాజా నిర్ణయంతో దాదాపు 2,367 మంది నిరుద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో బాధిత అభ్యర్థులున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరందరినీ ఎస్‌జీటీలుగా ప్రభుత్వంగా నియమించనుంది. ఎలా ఎంపిక చేస్తారంటే.. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్‌ పత్రాన్ని అందుబాటులో ఉంచారు. దీనిని డౌన్‌లోడ్ చేసుకుని.. వివరాలు పూర్తి చేసి సంబంధిత పత్రాలతో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలి. అనంతరం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు సంతకాలు చేయాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ సూచించింది. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్నారు.

అసలేంటీ 2008లో డీఎస్సీ వివాదం?

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2008లో డీఎస్సీ నిర్వహించగా.. చివరి నిమిషంలో 30 శాతం ఎస్జీటీ పోస్టులను ప్రత్యేకంగా డీఈడీ పూర్తి చేసినవారికి ప్రభుత్వం కేటాయించింది. దాంతో మార్కులపరంగా మెరిట్‌ ఉన్నప్పటికీ ఎంతో మంది బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. తమకు అన్యాయం జరిగిందని, ఉద్యోగాలు ఇవ్వాలంటూ అప్పటినుంచి వారు పోరు బాట పట్టారు. కోర్టులు సైతం వారికి న్యాయం చేయాలని తీర్పు ఇచ్చినా.. అప్పటి నుంచి పట్టించుకున్న నాథుడేలేడు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు తాజాగా వారికి కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీ ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.